Thursday, 17 November 2016

paneer cutlet special



పనీర్ కట్లెట్ స్పెషల్......
Related image

మీ రేఫ్రేజిరేటర్ లోపల పనీర్ లేదా చీజ్ ఉంటే, మీకు సగం సమస్య తీరినట్టే. మీరు పనీర్ ను ఉపయోగించి కట్లెట్ లను తయారు చేయవచ్చు. ఈ నోరూరించే రుచికరమైన వంటను చాలా తేలికగా తయారుచేయవచ్చు, ఈ వంటకు చాలా తక్కువ పదార్ధాలు మాత్రమే అవసరమౌతాయి. 

కావలసిన పదార్ధాలు:

1.కాటేజ్ చీజ్ (పనీర్) – 2 కప్పులు (తరిగినది)
2.ఉడికించిన అన్నం – ½ కప్పు (చల్లారినది)
3.రుచికి సరిపడా ఉప్పు
Image result for paneer images4.పచ్చిమిర్చి – 1 ½ టేబుల్ స్పూను (సన్నగా తరిగినవి)
5.మైదా – ¼ కప్పు
6.కొత్తిమీర – ¼ టీస్పూను (తరిగినది)
7.క్యాప్సికం – ½ కప్పు వివిధ రంగులవి (సన్నగా తరిగినవి)
8.పైన కోటింగ్ కి బ్రెడ్ పొడి
9.నూనె – 2 టేబుల్ స్పూన్లు      

తయారు చేసే విధానం:

1.సన్నగా తరిగిన చీజ్ తీసుకుని అందులో ఉడికించిన అన్నాన్ని కలపండి.

 2.ఇప్పుడు, మైదా, ఉప్పు, పచ్చిమిర్చి వేసి బాగా కలపండి.

 3.ఇప్పుడు, కొత్తిమీర, తరిగిన క్యాప్సికం వేయండి. మీరు వివిధ రకాల క్యాప్సికం తీసుకున్నట్లయితే, మీ కట్లెట్ లు చాలా అందంగా కనిపిస్తాయి. 

Image result for paneer cutlet 4.ఈ పదార్ధాలు అన్నిటినీ బాగా కలిపి, చేతితో చిన్నచిన్న ఉండలుగా చేయండి.
 5.ఇప్పుడు, తవా వేడిచేసి, నూనె రాయండి.

6.దానిపై కట్లెట్ లను ఉంచి, బంగారు రంగు వచ్చే వరకు కాల్చండి.


7.రెండువైపులా బాగా ఉడికిన తరువాత, పుదీనా పచ్చడి లేదా టొమాటో సాస్ తో వేడిగా వడ్డించండి.





1 comment:

Comments system