చైనా వారి శాటిలైట్
స్మార్ట్‌ఫోన్
ఈ స్మార్ట్‌ఫోన్‌లకు టవర్ సిగ్నల్‌తో సంబంధం ఉండదు. కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నప్పటికి ఈ స్మార్ట్‌ఫోన్‌తో మాట్లాడుకోవచ్చు.
శాటిలైట్ ఆధారంగా స్పందించే మొట్ట మొదటి స్మార్ట్‌ఫోన్‌ను చైనా ఏరోస్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ కార్పొరేషన్ అభివృద్థి చేసింది. కొద్ది నెలల క్రితం చైనా కక్ష్యలోకి లాంచ్ అయిన Tiantong-1 అనే శాటిలైట్‌కు ఈ ఫోన్‌లు నేరుగా అనుసంధానమై ఉంటాయి. తియాన్‌తాంగ్ - 1 పేరుతో చైనా తన మొట్టమొదటి మొబైల్ కమ్యూనికేషన్ శాటిలైట్‌ను ఆగష్టు 6న కక్ష్యలోకి ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే
TT-1 స్మార్ట్‌ఫోన్
శాటిలైట్‌కు కనెక్ట్ అయి ఉండే ఈ TT-1 స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా దేశవ్యాప్తంగా ఎక్కడ నుంచైనా మాట్లాడుకోవచ్చు. ఈ ఫోన్‌లను మరో రెండు మూడు నెలల్లో అమ్మకానికి ఉంచనున్నట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ఆదివారం ఓ కథనాన్ని ప్రచురించింది
ఐదేళ్ల కాలంలో మొబైల్ కమ్యూనికేషన్ శాటిలైట్స్
వచ్చే ఐదేళ్ల కాలంలో మరిన్ని Tiantong-1 శాటిలైట్ లను లాంచ్ చేయనున్నట్లు చైనా ఏరోస్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ కార్పొరేషన్ వెల్లడించింది.
ఎమర్జెన్సీ కమ్యూనికేషన్..
గ్రౌండ్ బేసిడ్ సెల్యులార్ నెట్‌వర్క్‌లను కూడా..
చైనాదే అతిపెద్ద టెలీస్కోప్
ఉక్కు స్తంభాలు, కేబుళ్ల సహాయంతో .. ఈ టెలీస్కోప్ విశ్వం నుంచి వెలువడే అర్థవంతమైన ధ్వనులు పసిగట్టగలదు. ఉక్కు స్తంభాలు, కేబుళ్ల సహాయంతో ఈ భారీ టెలీ స్కోప్‌ను నిర్మించటం జరిగింది. ఇప్పటి వరకు ప్రస్తుతానికి ప్యూర్టో రికోలోని అరెసిబో అబ్జర్వేరటరీ ప్రపంచపు అతిపెద్ద టెలీస్కోప్‌గా ఉంది. దీని వ్యాసం 300 మీటర్లు.
180 మిలియన్ డాలర్ల ఖర్చుతో
180 మిలియన్ డాలర్ల ఖర్చుతో ఈ భారీ ప్రాజెక్టును
చేపట్టారు. గ్రహాంతర జీవులకు విద్యుత్ అయస్కాంత(ఎలక్ట్రో మేగెటిక్) ధ్వని
తరంగాలను పంపించేందుకు ఈ ప్రాజెక్ట్ ద్వారా ఏర్పాట్లు చేశారు. గ్రహంతరవాసుల
అలికిడి.. ఈ టెలిస్కోప్ ద్వారా అంతరిక్షంలో ఎక్కడ ఏ చిన్న శబ్దం అలికిడైనా
తెలిసిపోతుంది. గ్రహంతరవాసులు అంతరిక్షంలో ఏ చిన్న శబ్దం చేసినా కాని అది చైనా
లోని ఈ టెలిస్కోప్ కు చేరిపోతుంది.రేడియో తరంగాలను సైతం 4,450 ప్యానెళ్లతో రూపొందించే ఈ టెలిస్కోపు రిఫ్లాక్టార్ వ్యాసం 500 మీటర్లు ఉంటుంది. ఒక్కొక్క ప్యానెల్ 11 మీటర్ల భుజపొడవుగల సమబాహు త్రిభుజ ఆకారంలో ఉంటుంది. విశ్వం నుంచి వెలువడే చిన్నచిన్న రేడియో తరంగాలను సైతం ఈ టెలిస్కోపు గుర్తించగలదని ఫాస్ట్ ప్రాజెక్ట్ చీఫ్ సైంటిస్ట్ నాన్ రెండాంగ్ తెలిపారు.
No comments:
Post a Comment