నల్ల కుబేరులకు షాకింగ్
- ప్రధాని
నరేంద్ర మోదీకి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ జేజేలు పలికారు. నవీన భారత్
ఆవిర్భవించిందని ట్విట్టర్ లో పేర్కొన్నారు.
- తన
తాజా చిత్రం ’పింక్’ కారణంగానే కొత్త 2 వేల రూపాయల నోటును పింక్ రంగులో ముద్రిస్తున్నారని
బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ చమత్కరించారు.
- నల్లధనం
దాచినవారు బయటపడక తప్పదని సీనియర్ నటుడు పరేశ రావల్ పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో రూ. 500, రూ.1000
నోట్లు బయటపెట్టక తప్పదని అన్నారు.
- సంచలనాత్మన
నిర్ణయం తీసుకున్న ప్రధాని మోదీకి దర్శకనిర్మాత మధుర్ భండార్కర్ అభినందనలు
తెలిపారు. పెద్ద నోట్లను రద్దు చేయడంతో నల్లధనం వెలికి వస్తుందని
అభిప్రాయపడ్డారు. దేశ ఆర్థికవ్యవస్థ బలోపేతం అవుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం
చేశారు.
- 9/11 రోజున కొంత మంది ఓడిపోతారు. కానీ చాలా మంది గెలుస్తారు. ప్రధాని
మోదీ శక్తివంతమైన, సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నార’ని బాలీవుడ్ నటుడు సునీల్ షెట్టి పేర్కొన్నారు.
- ఈ
మార్పును మనమంతా సహృదయంతో స్వాగతించాలి. ప్రతి పౌరుడి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని
ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసిందని హీరో అర్జున్ కపూర్ అన్నాడు.
- దేశ నిర్మాణం కోసం ప్రధాని మోదీ తీసుకున్న సాహసోపేత నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు హీరోయిన్ అనుష్క శర్మ తెలిపింది. దేశప్రయోజనాలను దృష్టిలో పెట్టుకున్న ఈ నిర్ణయాన్ని అమలు చేసేందుకు అందరూ సహరించాలని కోరింది.
ఆందోళనలో ప్రజలు: నిత్యావసర
సరుకుల కొనుగోలుకూ చిల్లర లేదు...
రూ. 500, 1000 నోట్ల
నిర్ణయంపై ఎమ్మెల్సీ సోమిరెడ్డి
ప్రధాని నరేంద్ర మోదీ రూ. 500, 100 నోట్లు
రద్దు నిర్ణయం చూడగానే నేను షాకయ్యాను. వెంటనే నా బీరువా తీసి చూసుకున్నాను. 26 వెయ్యి రూపాయల నోట్లు ఉన్నాయి. వాటిని ఎలా మార్చాలా అని ఆందోళన
చెందాను. నేనే ఈ రకంగా ఆందోళన చెందితే సోదరుడు జగన్ మోహన్‌రెడ్డి ఎంతగా ఆందోళన
చెందారో? బెంగళూరు వైట్ హౌస్‌లో భూగర్బంలో ఉన్న డబ్బును
ఏం చేయాలో తెలియక షాకై ఉంటారు. ఎప్పటినుంచో వెయ్యి, 500
నోట్లు రద్దు చేయాలని చంద్రబాబు చెబుతున్నారు. ఇంతటి
కీలక నిర్ణయంలో చంద్రబాబు ప్రభావం ఉంది. దటీజ్ చంద్రబాబు.
పెట్రోల్ బంకుల్లో బారులు తీరిన జనం...
హైదరాబాద్: రూ. 500, 1000 నోట్ల రద్దుతో
సామాన్యులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. జేబులో రూ. 500, 1000 నోట్లు తప్ప చిల్లరలేని వారు.. అవి ఎందుకు పనికిరాకపోవడంతో రోజు వారి
అవసరాలకు ఇబ్బందులు పడుతున్నారు. తరువాత నోట్లను మార్చుకునే అవకాశం ఉన్నప్పటికీ..
ఇప్పటికిప్పుడు ఉన్న కనీస అవసరాలను తీర్చుకోవడం కోసం చిల్లర కోసం నానా తంటాలు
పడుతున్నారు.
పెట్రోల్ బంకుల వద్ద రూ. 500, 1000 నోట్లను మార్చడానికి జనాలు ప్రయత్నిస్తున్నారు. దీంతో పెట్రోల్ బంకుల వద్ద పెద్ద సంఖ్యలో వాహనాలు బారులు తీరి కనిపిస్తున్నాయి. అయితే.. ఇక్కడ సైతం వారికి నిరాశే ఎదురౌతుంది. బంకుల నిర్వాహకులు సరైన చిల్లర ఇస్తేనే పెట్రోల్ పోస్తామని చెబుతున్నారు. అందరూ 500, 1000 నోట్లను మార్చుకోవడానికి పెట్రోల్ కోసం వస్తుండటంతో.. చిల్లర లేదని వారు అంటున్నారు. రూ. 500, 1000 నోట్లను తీసుకోవడానికి బంకుల నిర్వాహకులు నిరాకరిస్తున్నారు.
పెట్రోల్ బంకుల వద్ద రూ. 500, 1000 నోట్లను మార్చడానికి జనాలు ప్రయత్నిస్తున్నారు. దీంతో పెట్రోల్ బంకుల వద్ద పెద్ద సంఖ్యలో వాహనాలు బారులు తీరి కనిపిస్తున్నాయి. అయితే.. ఇక్కడ సైతం వారికి నిరాశే ఎదురౌతుంది. బంకుల నిర్వాహకులు సరైన చిల్లర ఇస్తేనే పెట్రోల్ పోస్తామని చెబుతున్నారు. అందరూ 500, 1000 నోట్లను మార్చుకోవడానికి పెట్రోల్ కోసం వస్తుండటంతో.. చిల్లర లేదని వారు అంటున్నారు. రూ. 500, 1000 నోట్లను తీసుకోవడానికి బంకుల నిర్వాహకులు నిరాకరిస్తున్నారు.
No comments:
Post a Comment