Tuesday, 8 November 2016

usa elections


అధ్యక్ష ఫలితాల్లో ట్రంప్ హవా



వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. తొలి ఫలితాల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో ఇండియానా, వెర్మంట్, ఒక్లహోమ, మిస్సిసిపి, కెంటకీ, వెస్ట్ వర్జీనియా, అలబామా, సౌత్ కరోలినా రాష్ట్రాల్లో ట్రంప్ ముందంజలో ఉన్నారు. కాగా, డలావేర్, డిస్టిక్ ఆఫ్ కొలంబియా, మేరీ ల్యాండ్, న్యూజెర్సీ, మసాచుసెట్స్, ఇల్లినాయిస్, వాషింగ్టన్ డీసీ లలో హిల్లరీ హవా కొనసాగుతోంది. అయితే గెలుపుపై హిల్లరీ, ట్రంప్ ధీమాగా ఉన్నారు. తానే గెలుస్తానంటూ ట్రంప్ ట్వీట్లు చేశారు.

కాగా.. లాస్ ఏంజల్స్ లోని ఓ పోలింగ్ బూత్ దగ్గర కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా ముగ్గురు గాయపడ్డారు.

No comments:

Post a Comment

Comments system