Tuesday, 8 November 2016

Boyapati cinema




బెల్లంకొండ శీను తో  డైరెక్టర్  బోయపాటి కొత్త సినిమా

Image result for boyapati bellamkonda new movie stills

బెల్లంకొండ శీనుని త్వరలో డైరెక్ట్ చేయబోతున్నాడు బోయపాటి శీను. సరైనోడు హిట్ తో టాప్ రేస్ లో ఉన్న బోయపాటి.. విజయం కోసం కిందా మీదా పడ్తోన్న బెల్లంకొండతో సినిమా తీస్తున్నాడంటే అందరూ షాకయ్యారు. ఇలా ఆశ్చర్యపోడానికి చాలా రీజన్సే ఉన్నాయ్. అన్నింటి కన్నా మెయిన్ బోయపాటి మూవీస్ అంటే పవర్ ప్యాక్డ్. మాసిజం ఊరకలేస్తుంటుంది. బాలక్రిష్ణ.. జూనియర్ ఎన్టీఆర్.. బన్నీ లాంటి వాళ్లే బోయపాటి సినిమాల్లో హీరోయిజాన్ని కరెక్ట్ గా ప్రజెంట్ చేయగల్గారు. అలాంటిది ఫ్రేమ్ లో ఇంకా సరిగ్గా సెట్ కానీ శీనుతో బోయపాటి మూవీ అనే సరికే చాలామందికి చాలా డౌట్స్ వస్తున్నాయ్.

నిజానికి బెల్లంకొండ శీనుతో సినిమా చేస్తానని బోయపాటి ఎప్పుడో కమిట్ అయ్యాడు. అయితే ఆ ప్రాజెక్ట్ అనుకున్న టైంకి పట్టాలెక్కలేదు. ప్రతిసారీ ముహుర్తం జరుపుకోవడం వెనక్కి వెళ్లిపోవడం వీళ్ల కాంబినేషన్ కి రొటీన్ అయిపోయింది. ఈ గ్యాప్ లో బోయపాటి- బెల్లంకొండ చెరో మూవీ రిలీజ్ చేసుకొన్నారు కూడా. బోయపాటి గ్రాఫ్ పెరగ్గా.. బెల్లంకొండ మాత్రం అలాగే ఉండిపోయాడు. అందుకే అడ్వాన్స్ తీసుకున్నాడు కాబట్టి మొహమాటానికి బోయపాటి సినిమా చేస్తున్నాడనే ప్రచారం గట్టిగా జరుగుతుంది.

అయితే వాస్తవం ఇంకోలా ఉందట. ప్రామిస్ చేశాడు ఏదో నామ్ కే వాస్తే మూవీని చుట్టేయకుండా బెల్లంకొండ కెరీర్ కి కొత్త బ్రేక్ ఇవ్వడానికి బోయపాటి చాలా కేరే తీసుకుంటున్నాడనే టాక్ వినిపిస్తోంది. బాడీ లాంగ్వేజ్ దగ్గర్నుంచి డైలాగ్ డెలివరీ వరకు అన్ని విషయాల్లో శీనుని రాటు దేల్చుతున్నాడట. అల్రెడీ శీను చేసి సినిమాలు చూసి ఎక్కడెక్కడ వీక్ గా ఉన్నాడో ఆ సెక్షన్స్ లో ట్రైనింగ్ ఇప్పిస్తున్నాడట. అచ్చంగా 2-3 నెలలు దీనికే స్పెండ్ చేశారని అంటున్నారు. చూస్తుంటే బెల్లంకొండ శీనుని ప్రామిసింగ్ హీరోగా మార్చడానికి బోయపాటి చాలా కృషే చేస్తున్నట్టున్నాడు. మరి డైరెక్టర్ శీను హీరో శీనుకి చేస్తోన్న మేకోవర్ ఎలా ఉంటుందో ఫ్యూచర్లో చూడాలి.

No comments:

Post a Comment

Comments system