Wednesday, 9 November 2016



మ్యాటర్ లీక్: అఖిల్ కాబోయే భార్యకు.... నితిన్ లవ్ ఎఫైర్‌కు లింక్?
హైదరాబాద్: అక్కినేని యంగ్ హీరో అఖిల్ త్వరలో పెళ్లికొడుకు కాబోతున్న సంగతి తెలిసిందే. తన ప్రియురాలు శ్రీయభూపాల్ ను అఖిల్ పెళ్లాడబోతున్నాడు. శ్రీయ భూపాల్ హైదరాబాద్ కు చెందిన ఒక ప్రముఖ వ్యాపారవేత్త షాలిని భూపాల్‌ కుమార్తె. ఈ షాలిని ఎవరో కాదు.. ప్రముఖ వ్యాపారవేత్త, జీవికె గ్రూప్‌ అధినేత జివి కృష్ణా రెడ్డి కుమార్తె. శ్రీయ భూపాల్ ఆయన మనవరాలు. ఇదంతా అందరికీ తెలిసిందే కదా.... అఖిల్ కు కాబోయే భార్యకు, నితిన్ లవ్ ఎఫైర్ కు లింకేటి అనుకుంటున్నారా? వస్తున్నాం.. వస్తున్నాం... ఆ మ్యాటర్లోకే వస్తున్నాం. అఖిల్, నితిన్ మంచి ఫ్రెండ్స్. ఈ క్రమంలోనే ఇటీవల శ్రీయ భూపాల్ ను నితిన్ కు పరిచయం చేసాడట. తరచూ.... అఖిల్, శ్రీయ భూపాల్, నితిన్ పలు పార్టీల్లో కలిసే వారని, శ్రీయ భూపాల్ తో పాటు ఆమె ఫ్రెండ్స్ కూడా ఆ పార్టీలకు వచ్చేవారని...... శ్రీయ భూపాల్ ఫ్రెండ్స్ లో ఒక అమ్మాయితో నితిన్ ప్రేమలో పడ్డాడని తెలుస్తోంది.

మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్

ఎవరా అమ్మాయి? నితిన్ ప్రపోజ్ చేసిన అమ్మాయి శ్రీయ భూపాల్ కు చాలా క్లోజ్ ఫ్రెండ్. హైదరాబాద్ కు చెందిన ప్రముఖ వ్యాపార వేత్త కుమార్తె అని ప్రచారం జరుగుతోంది. అయితే అమ్మాయి ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో.... ఇరు వర్గాల పెద్దల అంగీకారం తెలిపే వరకు ఆమె ఎవరనే విషయమై గోప్యత కొనసాగిస్తున్నారని టాక్.

No comments:

Post a Comment

Comments system