చైనీస్ పన్నీర్ కర్రీ
కావలసిన పదార్థాలు:
పనీర్ - వంద గ్రా.,
నూనె
- 2 టేబుల్ స్పూన్లు,
ఉల్లిపాయ - 1,
క్యాప్సికం - 1,
సోయా
సాస్ - 2 టేబుల్ స్పూన్లు,
కార్న్‌ఫ్లోర్ - 1 టేబుల్ స్పూను,
టమోటో సాస్ - 2 టేబుల్ స్పూన్లు,
వెజిటెబుల్
స్టాక్ - ఒకటిన్నర కప్పు,
మెదిపిన వెల్లుల్లి రేక - 1,
కారం - అర టీ స్పూను,
మిరియాల
పొడి - 1 టీ స్పూను,
బ్రౌన్ షుగర్ - 1 టీ స్పూను,
వెనిగర్
- 1 టీ స్పూను,
టమోటో
గుజ్జు - 2 టేబుల్ స్పూన్లు (ఇవన్నీ ఒక పాత్రలో కలుపుకుని ఉంచుకోవాలి).
తయారుచేసే విధానం:
పనీర్ ముక్కలను మైదా జారులో ముంచి నూనెలో దోరగా వేగించి
పక్కనుంచాలి. నూనెలో ఉల్లి, క్యాప్సికం ముక్కల్ని
వేగించాలి. ఇప్పుడు కలుపుకున్న సాస్ వేసి చిన్న మంటపై 5
నిమిషాలు (కలుపుతూ) ఉడికించాలి. సాస్ చిక్కబడ్డాక పనీర్ ముక్కలు వేయాలి. చివర్లో
ఉప్పు, మిరియాలపొడి కలపాలి. మరీ చిక్కగా అనిపిస్తే
కొద్దిగా నీరు పోసి కొద్దిసేపు ఉడికించాలి. దించేముందు కొత్తిమీర చల్లాలి. చపాతీ,
పరాటాలతో చాలా రుచిగా ఉండే చైనీస్ కర్రీ ఇది.
No comments:
Post a Comment