మహిళలలో సెక్స్ ఆసక్తి ఎందుకు ఉండదు?
అనేక మంది మహిళలు శృంగారం
పట్ల పెద్దగా ఆసక్తి చూపించరు. దీనికి వారికి ఉన్న పని ఒత్తిడి, మానసిక ఆందోళన వంటి అనేక కారణాలు ఉండొచ్చని
సెక్స్ వైద్యులు చెపుతున్నారు. ఇలాంటి వాటిలో పురుషుల పట్ల ఏహ్య భావం, సెక్స్ అంటేనే తప్పుడు భావాన్ని కలిగి ఉండటం, సెక్స్‌లో
పాల్గొన్నప్పటికీ.. యోనిలో స్రావాలు విడుదల కాకపోవడం వంటి కారణాలు ఉండొచ్చని వారు
చెపుతున్నారు.
అన్నిరకాలుగా ఆరోగ్యంగా ఉన్నప్పటికీ..
సెక్సుపై చర్చ, ఆ పదం విన్నా కొందరు
చాలా ఏహ్యభావాన్ని చూపుతారు. రతి క్రీడ అనేది ఒక నేరంగా భావిస్తారు. ఇందుకు
పురుషులను తప్పుగా అర్థం చేసుకుని వారిని సాధ్యమైనంత దూరంగా ఉంచేందుకు
ప్రయత్నిస్తుంటారు. చిన్నతనంలో లైంగిక వేధింపులు ఎదుర్కొన్న వారిలో ఇలాంటి సమస్య
ఎక్కువగా కనిపిస్తుంది. ఇలాంటి వారు వివాహమైనా ఆ భావన నుంచి కోలుకోవడం కష్టమని
వైద్యులు చెపుతున్నారు.
మరికొందరు మహిళల్లో పూర్తి
సంతృప్తిగా సెక్స్‌లో పాల్గొన్నప్పటికీ.. వారి నుంచి స్రావాలు విడుదల కావు. దీంతో
సెక్స్‌లో పాల్గొన్నామన్న ఆనందం వారిలో కనిపించదు. చిన్నప్పుడు లైంగిక వేధింపులకు
గురికావడం, లైంగిక పరిజ్ఞానం
లేకపోవడం, మెనోపాజ్ సమయంలో మానసిక స్థితిలో తేడా..
ప్రసవానంతర అనాసక్తి వంటివి ఇందుకు ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు.
వీటన్నింటి కంటే ముఖ్యంగా, అసౌకర్యంగా ఉండటం, చికాకుగా
ఉండటం వల్ల కూడా లైంగికంగా కలుసుకునేందుకు ఆసక్తి చూపించరు. ఇలాంటి వాటి సమస్యల
నుంచి బయటపడేందుకు ముందుగా కౌన్సెలింగ్ ఇప్పిస్తే కాస్తైనా ఫలితం ఉంటుందని
వైద్యులు చెపుతున్నారు.
No comments:
Post a Comment