స్పైసీ తందూరి గోబీ
కావలసిన పదార్థాలు:
కాలీఫ్లవర్:
మీడియం సైజుది,
పెరుగు: రెండు స్పూన్లు,
నూనె: తగినంత,
నిమ్మరసం:
రెండు స్పూన్లు,
కారం: తగినంత,
ఉప్పు:
రుచికి సరిపడ,
అల్లం
ముక్కలు: స్పూను,
ఎండుద్రాక్ష:
ఎనిమిది,
గరంమసాలా పొడి: టేబుల్ స్పూను,
దాల్చినచెక్క:
చిన్న ముక్క,
యాలకులు:
మూడు లేక నాలుగు,
లవంగాలు:
మూడు,
బిర్యానీ
ఆకు: కొద్దిగా,
కొత్తిమీర: కొద్దిగా.
తయారీ
విధానం:
మందపాటి గిన్నెలో నీరు పోసి అందులో దాల్చినచెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ
ఆకు వేసి కొద్దిగా తెర్లనిచ్చి, నీటిలోంచి తీసి పక్కన
పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నీటిలో కాలీఫ్లవర్‌ను కావల్సిన సైజులో ముక్కలుగా
చేసుకొని ఉడికించి నీరంతా వంపేసి పక్కన పెట్టుకోవాలి. మరొక గిన్నెలో పెరుగు,
నిమ్మరసం, కారం, ఉప్పు, ఎండుద్రాక్ష, గరంమసాలా
కొద్దిగా నూనె పనీర్ ముక్కలు అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని
కొద్దిగా నాననిచ్చి అనంతరం ఉడికించిన మసాలా దినుసులు, కాలీఫ్లవర్
ముక్కలను కూడా వేసి బాగా కలిపి కొద్దిసేపు నానబెట్టాలి.అనంతరం బాండీలో తగినంత నూనె
వేసి వేయించుకోవాలి. దించే ముందు కొత్తిమీర చల్లుకోవాలి.
No comments:
Post a Comment