ధైరాయిడ్ తీరుతెన్నులు :
మన శరీరంలోని ముఖ్యమైన గ్రంథుల్లో థైరాయిడ్ ఒకటి. ఇది మన శారీరక ఎదుగుదలలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ గ్రంథి పనితీరు గతితప్పడం వలన హైపో థైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం, గాయిటర్ వంటి సమస్యలు తలెత్తుతాయి. దీనికి గల స్పష్టమైన కారణాలు తెలియవు. కాని ఈ సమస్యలను ఆదిలోనే గుర్తిస్తే మెరుగైన చికిత్సను అందించి పూర్తిగా నయం చేయవచ్చును . థైరాయిడ్ వచ్చినపుడు నిపుణులతో స్వరపేటిక పరీక్ష చేయించుకోవలెను. ఎందుకంటే ఒకొక్కసారి థైరాయిడ్ వ్యాధి ముదిరి లోపల స్వరపేటికకు ప్రాకి బొంగురు సంభవించవచ్చును.
థైరాయిడ్:
థైరాయిడ్ గ్రంధి మెడ ప్రాంతంలో కంఠముడి (ఎడమ్స్ ఏపిల్) కింద ఉండే ఒక గ్రంధి. ఇది సీతాకోకచిలుక యొక్క రెక్క రూపంలో శ్వాస నాళానికి (ట్రెఖియా) యిరు పక్కలా ఉంటుంది.
థైరాయిడ్ గ్రంధి నుండి విడుదలయ్యే థైరాయిడ్ హార్మోన్ మన శరీరంలో ప్రతి కణంపై ప్రభావం చూపి, మన శరీరం యొక్క పనులను నియంత్రించేందుకు సాయపడుతుంది. థైరాయిడ్ గ్రంధి పిట్యూటరీ అనబడే యింకొక గ్రంధి హైపోథేలమస్ అనే మెదడులోని భాగం శరీరంలోని థైరాయిడ్ హార్మోన్ మొత్తాన్ని నియంత్రించేందుకు కలిసి పని చేస్తాయి. ఉదాహరణకు దేహంలో తగినంత థైరాయిడ్ హార్మోను లేకపోతే పిట్యూటరీ గ్రంధి ఈ అవసరాన్ని గ్రహించి, థైరాయిడ్‌ని ఉత్తేజపరిచేందుకు థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ (టి.ఎన్.హెచ్)ని విడుదల చేస్తుంది. అలాంటి టిఎన్‌హెచ్ సంకేతంతోనే థైరాయిడ్ గ్రంధి హార్మోన్‌ని ఉత్పత్తి చేసి రక్తంలోకి నేరుగా పంపుతుంది.
హైపర్ థైరాయిడ్‌జమ్:
ఈ రుగ్మత థైరాయిడ్ గ్రంధి మరీ ఎక్కువ హార్మోన్‌ని ఉత్పత్తి చేయడం వలన ఏర్పడుతుంది.
లక్షణాలు:
ఈ వ్యాధి వచ్చినప్పుడు గొంతు థైరాయిడ్ గ్రంధి (వాపు) పెద్దదవవచ్చు (గాయిటర్).
1. త్వరితమైన గుండెరేటు- నిముషానికి 100 కంటే ఎక్కువ.
2. నరాల బలహీనత, ఆదుర్దా, చికాకు.
3. చేతులు వణకడం.
4. చెమటలు పట్టడం.
5. మామూలుగా తింటున్నా బరువు కోల్పోవటం.
6. వేడి తట్టుకోలేక పోవటం.
7. జుట్టు ఊడిపోవటం
8. తరచూ విరేచనాలు.
9. కళ్ళు ముందుకు చొచ్చుకురావటం.
10. తరచూ రుతు శ్రావం.
11. సక్రమంగా లేని గుండె లయ
చికిత్స : ఇందులో వయసుబట్టి వైద్యం ఉంటుంది. చిన్న వయసులో ఉంటే యాంటి థైరాయిడ్ మందులు వాడుతారు. 45 ఏళ్ల లోపు ఉన్న వారిలో అవసరాన్ని బట్టి ఆపరేషన్ చేయాల్సిరావచ్చు. రేడియో థార్మికత ఇచ్చే వైద్యం బాగా ప్రాచుర్యం పొందింది. ఇదిసామాన్యంగా 45 ఏళ్లు పైవారికి ఇస్తారు. చికిత్స తీసుకునేటప్పుడు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
మందులు స్పెసలిస్ట్ డాక్టర్ సలహా తో వాడాలి .
హైపోథైరాయిడిజం:
థైరాయిడ్ గ్రంధి మామూలుకన్నా తక్కువగా థైరా యిడ్ హార్మోన్స్ ఉత్పత్తి చేస్తున్న పðడు ఈ పరిస్థితి వస్తుంది.
లక్షణాలు:
1. అలసట, నీరసం. 2. నిద్రమత్తు. 3. ఏకాగ్రత కోల్పోవడం. 4. పెళుసైన పొడిజుట్టు, గోళ్ళు. 5. దురద పుట్టించే పొడి చర్మం. 6. ఉబ్బిన ముఖం. 7 మలబద్దకం. 8. శరీరం బరువెక్కడం. 9. తక్కువైన రుతుశ్రావం. 10. రక్తహీనత.
హైపోథైరాయిడిజంని నిర్ధారణ చేయడం ఎలా
డాక్టర్‌గారు గుర్తించగల ప్రత్యేక లక్షణాలు మరియు శారీరక చిహ్నాలు. థైరాయిడ్ వచ్చినపðడు నిపుణులతో స్వరపేటిక పరీక్ష చేయించుకోవలెను. ఎందుకంటే ఒకొక్కసారి థైరాయిడ్ వ్యాధి ముదిరి లోపల స్వరపేటికకు ప్రాకి బొంగురు సంభవించవచ్చును.
టి.ఎన్.హెచ్. ( థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్/థైరో (టోపిన్) పరీక్ష. ఎక్కువగా ఉండును .
రక్తంలో పెరిగిన టి.ఎస్.హెచ్. స్థాయి. హైపో థైరాయిడ్‌జమ్ యొక్క ఖచ్చితమైన సూచిక.
థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి చేయడం కొద్దిగా తగ్గగానే ఈ పిట్యూటరీ హార్మోన్ ఉత్పత్తి ఎక్కువవుతుంది.
No comments:
Post a Comment