గాలి వారింట పెళ్లి ఖర్చు
మైనింగ్ రారాజుగా.. గాలి
జనార్దనరెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం ఉండదు. తన కుమార్తె
పెళ్లి సందర్భంగా ఆయన తయారు చేయించిన పెళ్లి శుభలేఖ అందరి దృష్టిని ఆకట్టుకోవటమే
కాదు.. అదో సంచలనంగా మారింది. శుభలేఖను ఒక ఖరీదైన బాక్స్ లో ఎల్ సీడీని ఏర్పాటు
చేసి.. పాట రూపంలో పెళ్లి ఆహ్వానాన్ని పిలవటం వెరైటీగా ఉండటమే కాదు.. దేశ ప్రజల
దృష్టిని విపరీతంగా ఆకర్షించింది. పెండ్లి పిలుపు కోసం ప్రత్యేకంగా ఒక పాటను
కంపోజ్ చేసి మరీ శుభలేఖగా తయారు చేసిన ఐడియాతో.. గాలి వారింట పెళ్లి సందడి మరెన్ని
విశేషాలు ఉంటాయన్న ప్రచారం జరిగింది.
ఈ ప్రచార తీవ్రత పెరిగిపోయి.. చివరకు ఐటీ శాఖాధికారులు దృష్టి సారించే వరకూ వెళ్లింది. దీంతో.. పెళ్లి సందడి తర్వాత కొత్త కేసులు చుట్టుకుంటాయన్న ఆలోచనతో గాలి పరివారారినికి చెందిన శ్రీరాములు మీడియా ముందుకు వచ్చి.. తాము మధ్య తరగతికి చెందిన వారిమేనని.. సగటు మధ్యతరగతి ఇళ్లల్లో ఎలా అయితే పెళ్లి వేడుక జరుగుతుందో అదే రీతిలో జరుగుతుందని చెప్పి.. చాలామందికి షాకిచ్చారు.
అయితే.. ఇలాంటి మాటలన్ని ఎవరికోసమో తెలిసిన వారంతా చిద్విలాసంగా నవ్వుకునే పరిస్థితి. తాజాగా.. గాలి వారింట జరిగే పెళ్లికి పెట్టే ఖర్చు లెక్కలు మీడియాకు పొక్కాయి. సగటు మధ్యతరగతి కుటుంబంలో జరిగినట్లుగా జరుగుతుందని చెప్పిన వేడుక ఖర్చు జస్ట్ రూ.250 కోట్లుగా చెబుతున్నారు. ఈ ఖర్చులో భోజనం కోసం పెట్టే ఖర్చు చూస్తే నోట వెంట మాట రాని పరిస్థితి.
ఒక్క భోజనాల కోసమే గాలి వారు రూ.100 కోట్ల వరకూ ఖర్చు చేయాలని డిసైడ్ అయినట్లుగా చెబుతున్నారు. పెళ్లి వేడుక సందర్భంగా ఏర్పాటు చేసే విందులో ప్రపంచ ప్రఖ్యాత వంటకాలన్నీ ఉండాలని గాలి జనార్దన్ రెడ్డి ఆదేశించినట్లుగా తెలుస్తోంది. పెళ్లి వేడుకలకు సినీ రంగ ప్రముఖులు మొదలుకొని రాజకీయ.. పారిశ్రామికవేత్తల వరకూ పోటెత్తుతారని చెబుతున్నారు. పెళ్లి వేడుకకు వచ్చే ప్రముఖుల కోసం.. బాలీవుడ్ ప్రముఖుల చేత ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. నవంబరు 16న బెంగళూరు ప్యాలెస్ లో జరిగే గాలి వారి పుత్రిక బ్రాహ్మణి పెళ్లికి సంబంధించి మరెన్ని ముచ్చట్లు రానున్న రోజుల్లో బయటకు వస్తాయో..?

No comments:
Post a Comment